జమ్ము కశ్మీర్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పూంఛ్ పట్టణంలోని మెందర్ వద్ద కొందరు స్థానికులు కాలువ దాటుతున్నారు. ఇంతలో భారీగా వరదలు రావడంతో కాలువలోనే ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. కాలువ మధ్యలో ఉన్న పెద్ద రాయిపై నిలబడ్డాడు. వరద ప్రభావం తగ్గిన తర్వాత ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలను తెగించి అతడిని బయటకు తీసుకొచ్చారు. వరదలో చిక్కుకున్న వ్యక్తి హర్నీ నల్లాగా గుర్తించారు.