రక్షణ దళాలకు సాయుధ డ్రోన్లను అందించేలా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. 31 ఎంక్యూ-9బీ (predator) డ్రోన్ల కోసం లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ను జులై తొలివారంలో అమెరికా ప్రభుత్వానికి పంపిస్తామని రక్షణ శాఖ అధికారి ఓ ఆంగ్ల పత్రికతో తెలిపారు. ఈ మానవ రహిత విమానాలను 6-7 ఏళ్లలో దశలవారీగా దళాల్లోకి చేర్చేలా కేంద్రం వ్యూహం సిద్ధం చేస్తోంది. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా దాదాపు రూ.29 వేల కోట్ల ఒప్పందాన్ని స్వాగతించారు.