కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల చార్జీలతో విద్యుత్ చార్జీల ను భారీగా పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపిందని గాజువాక నియోజకవర్గ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం ఉదయం పెద గంట్యాడ సబ్ స్టేషన్ కార్యాలయం ముందు సీపీఐ ధర్నా నిర్వహించింది. ధర్నా నుద్దేశించి గాజువాక నియోజక వర్గ సీపీఐ కార్యదర్శి కసి రెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా ట్రువర్డ్ ఛార్జీలు, ఫిక్స్ డు ఛార్జీలు , ఎలక్ట్రికల్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు , విద్యుత్ టారిఫ్ లాంటి ఆరు రకాల ఛార్జీలు పెంచి ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తుంది అని అన్నారు. వందల్లో వచ్చే కరెంట్ బిల్లు వేలల్లో వస్తుందని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ దర్నాలో సీపీఐ నాయకులు పల్లే టి పోలయ్య , జి. ఆనంద్ , కె. అచ్యుత రావు , పి. దుర్గారావు , వై. నందన్న , సోమేష్ , మాధవ రావు తదితరులు పాల్గొన్నారు.