సిగరెట్ తాగుతున్నాడని ఆగ్రహానికి గురైన స్కూల్ ఛైర్మన్ బెల్టులతో విద్యార్థిని చితకబాదాడు. దీంతో అతను స్పృహ తప్పాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విద్యార్థి మెడ, చేతులతో పాటు ప్రైవేటు భాగాల్లోనూ తీవ్ర రక్తస్రావం అయ్యిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఖండించిన స్కూల్ చైర్మన్.. విద్యార్థే ఆత్మహత్య చేసుకున్నాడని తాము కొట్టలేమని అన్నారు. ఈ ఘటన బిహార్లో జరిగింది.