కులాల గురించి మాట్లాడను అంటూనే రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. పవన్ పార్టీకి గుర్తు లేదు.. ఎన్ని సీట్లలో పోటి చేస్తాడో కూడా తెలియదని సెటైర్లు వేశారు. 'పవన్ సీఎం అవ్వాలన్న విశ్వరూప్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. పవన్ చుట్టూ ఉండే వారందరూ క్రిమినల్స్. ఆయన చుట్టూ చేరి విజిల్స్ వేస్తున్న వారందరూ క్రిమినల్సే.' అంటూ మండిపడ్డారు.