రాష్ట్రం కోసం.. ఇక్కడి ప్రజల కోసం కొంతమంది ముందుకు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు. పదవులకోసం పార్టీని తాకట్టు పెట్టలేమన్నారు. రాజకీయాలంటే ఎంతసేపు బూతులు తిట్టుకోవడం, డబ్బులు సంపాదించుకోవడంగా మార్చేశారని, అందరి దృష్టి, దిష్టి గోదావరి జిల్లాలపైన పడిందని, దీని నుంచి విముక్తి కల్పించేందుకు గోదావరి జిల్లాల నుంచి పోరాటం మొదలు పెట్టానని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకూడదనే లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు. ముఖ్యమంత్రి 18 ఏళ్ల వయసులో చేసిన అరాచకాలను ఆదర్శంగా తీసుకుని ఇప్పటి వైసీపీ నాయకుల పిల్లలు డీఎస్పీ, ఎస్పీలను కొడుతున్నారని, ఎదుటి వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు మనం నోరు ఎత్తకపోతే.. మనకు అన్యాయం జరిగినప్పుడు ఎవరు రారని పవన్ కల్యాణ్ అన్నారు.