ఏపీలోని పంచాయితీ రాజ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 9 నెలల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవంటూ పంచాయతీరాజ్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ప్ల కార్డ్స్ పట్టుకొని పంచాయతీరాజ్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. తొమ్మిది నెలలుగా అప్పులు చేసుకుని తింటున్నామన్నారు. ఇప్పుడు అప్పు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సామరస్యంగా నిరసన తెలుపుతుంటే 9 నెలల జీతాలు ఇచ్చి ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తే ఇదే బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. కాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు పది సంవత్సరాల నుంచి 15 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు.