మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు.అనిల్ కుమార్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుని సీఎం జగన్‌తో దాదాపు 45 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. నెల్లూరు నగరం, జిల్లాలో పార్టీ బలంగా ఉందని, గెలుపుపై ఎలాంటి సందేహం లేదని అనిల్ కుమార్ సీఎంకు వివరించారు.పార్టీ నేతల మధ్య విభేదాలపై అనిల్ నుంచి సీఎం జగన్ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులు ఐక్యంగా ముందుకు సాగి పార్టీ విజయానికి కృషి చేయాలని మాజీ మంత్రి అనిల్‌ను సీఎం జగన్ ఆదేశించారు.