నిజాంపట్నం పంచాయతీలో మంగళవారం రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుందని ఎంపీపీ మోపిదేవి విజయనిర్మల హరినాథ్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు పాల్గొని పంచాయతీ పరిధిలోని కోసూరు వారి పాలెం, మరకా వారి పాలెం, ఫిషర్ మెన్ కాలనీలలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు వివరిస్తారన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.