అంగన్వాడీలకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అధికార, రాజకీయ వేధింపులు ఆపాలని సమస్యలు పరిష్కరానికి అంగన్వాడీల పోరుయాత్ర ప్రారంభ సభలో వక్తలు అన్నారు. సోమవారం అంగన్వాడి వర్కర్స్&హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ ) తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడియం దేవిచౌక్ సెంటర్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. ఎస్. మూర్తి జండా ఊపి యాత్ర ప్రారంభించారు. అంతకముందు జరిగిన సభ లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి. రాజులోవ మాట్లాడుతూ అంగన్వాడిలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తానన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేసి ముఖ్యమంత్రి నిజాయితీ నిరూపించుకోవాలని కోరారు. చిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్వారి సమస్యల పరిష్కారానికి ఏమాత్రం చొరవ చూపలేదని అన్నారు. సమస్యలు పరిష్కరించమని ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తున్న వారిని మహిళలని చూడకుండా అర్ధరాత్రి స్వతం అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. మాట తప్పను మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు.