సత్తెనపల్లి పట్టణంలోని రంగాకాలనీకి చెందిన మునిగార్ల సుబ్రహ్మణ్యం ఈనెల 6వ తేదీ సాయంత్రం నుంచి కన్పించటం లేదని ఆయన భార్య కోటేశ్వరి సత్తెనపల్లి పట్టణ పోలీసు స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేసింది. 6వ తేదీ సాయంత్రం నుంచి ఇంటి నుంచి వెళ్లిన తన భర్త ఆచూకీ కోసం బంధువుల ఇళ్ళల్లో, స్నేహితుల ఇళ్ళల్లో, ఇతర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించక పోవటంతో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు.