విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె రాజు మంగళవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఈరోజు గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నుండి పలువురు కార్యాలయంకు విచ్చేసి తమ సమస్యలను కెకె రాజు కి స్వయంగా వచ్చి విన్నవించారు. వారి వద్ద నుండి సంబంధిత వినతి పత్రాలు దరఖాస్తులు తీసుకుని అధికారులతో మాట్లాడి కొన్ని వెంటనేపరిష్కరించారు. మరికొన్ని సంబంధిత అధికారులకు రిఫర్ చేసి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హునుక్, అల్లుశంకర్ రావు, మాజీ కార్పరేటర్లు బాక్సర్ రాజు, కె. వెంగలరావు, కార్పరేటర్లు కె అనిల్ కుమార్ రాజు, డైరెక్టర్ పైడిరమణ, ఐ. రవి కుమార్, పైడి శ్రీను, సీనియర్ నాయకులు పెడడా రమణి కుమారి, కిరణ్ రాజు, నీలిరవి, హరిపట్నాయక్, కె. రమణరెడ్డి, బి. గోవింద్ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.