రాజస్థాన్ లోని బికనీర్ లో 58 ఏళ్ల మహిళ కవలలకు జన్మనిచ్చింది. వారిలో ఒకరు కుమారుడు, మరొకరు కుమార్తె. పిల్లలు లేకపోవడంతో విసుగుచెందిన మహిళ.. చివరి ప్రయత్నంగా IVF ను ఆశ్రయించింది. పిల్లల్ని కనేందుకు రెండేళ్లపాటు చికిత్స చేయించుకొని చివరికి గర్భం దాల్చి 9 నెలల తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ వయసులో కూడా పిల్లలు కావాలని తపన పడిన ఆమెను చుట్టుపక్కల వారందరూ కొనియాడుతున్నారు.