తాను గుంటూరు ఎంపీగా పోటీ చేస్తానని వచ్చిన వార్తలు అన్నీ ఊహాగానాలేనని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పేర్కొన్నారు. అంబటి రాయుడు మంగళవారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా అమీనాబాద్ లోని మూలాంకరీశ్వరి దేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పాఠశాలలో విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. వారికి కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడారు. అమ్మవారు పుట్టిన గ్రామానికి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు ఉన్నతస్థాయిలో ఉన్నవారిని ఆదర్శంగా తీసుకొని చదవాలన్నారు.
తాను గుంటూరు ఎంపీగా పోటీ చేస్తానని వచ్చిన వార్తలు అన్నీ ఊహాగానాలేనని అంబటి రాయుడు ఓ ఛానల్ తో చెప్పారు. తాను ఇదివరకు ముఖ్యమంత్రిని కలిశానని, కానీ రాజకీయాలు మాట్లాడలేదని చెప్పారు. తాను ప్రజా సేవ చేస్తానని, కానీ ఏ ప్లాట్ ఫామ్ నుండి అనేది త్వరలో చెబుతానని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, రైతు సమస్యలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు.