గత తొమ్మిదేళ్లలో దేశంలో జాతీయ రహదారుల మొత్తం పొడవు దాదాపు 59 శాతం పెరిగింది.ఈ విస్తరణ ఫలితంగా, భారతదేశం ఇప్పుడు అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2013-14లో జాతీయ రహదారుల మొత్తం పొడవు 91,287 కి.మీలు కాగా, 2022-23 నాటికి 1,45,240 కి.మీలకు పెరిగిందని, ఈ సమయంలో అది 59 శాతానికి పైగా పెరిగిందన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో తన మంత్రివర్గం సాధించిన విజయాలపై మీడియాతో మాట్లాడుతూ నాలుగు లైన్ల జాతీయ రహదారులు దాదాపు రెండు రెట్లు పెరిగాయని అన్నారు. 2013-14లో, 4-లేన్ NH పొడవు 18,371 కి.మీ. ఇది గత తొమ్మిదేళ్లలో 44,654 కి.మీ.కి పెరిగింది. ఫాస్ట్‌ట్యాగ్‌ను ప్రవేశపెట్టడంతో టోల్ వసూలు గణనీయంగా పెరిగిందని గడ్కరీ చెప్పారు. 2013-14లో రూ.4,770 కోట్లుగా ఉన్న టోల్‌ల ఆదాయం 2022-23లో రూ.41,342 కోట్లకు పెరిగిందని మంత్రి వివరించారు. 2030 నాటికి టోల్ ఆదాయాన్ని రూ.1,30,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు.