తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో నేడు స్వామివారి సర్వదర్శనానికి కేవలం 3 గంటల సమయం పడుతోంది. ఒకే ఒక్క కంపార్టుమెంట్లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. కాగా మంగళవారం 69,143 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. స్వామివారికి 26,145 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.