ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ప్రభుత్వానికి హితవు పలికిన జనసేనాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 28, 2023, 11:20 AM

తెలంగాణ పోలీస్‌ నియామక రాత పరీక్షల్లో తప్పులను ప్రభుత్వం సరిదిద్దాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటనలో ఉన్న ఆయన్ను మంగళవారం తెలంగాణ యువకులు కలిశారు. గత ఏడాది నిర్వహించిన పోలీస్‌ నియామక పరీక్షల్లో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చినట్టు ప్రామాణిక ఆధారాలతో సహా చూపించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ఒక్క మార్కు అయినా సరే అభ్యర్థి తలరాత మారుస్తుందని ఈ సందర్భంగా పవన్‌ ఆవేదన వెలిబుచ్చారు. తెలంగాణ యువకుల ఆవేదనను, ఆందోళనను సానుకూల దృష్టితో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com