ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళితులని ముంచిన ప్రభుత్వమే వైసీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 28, 2023, 11:31 AM

వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలు లక్ష్యంగా జరుగుతున్న దాడులకు అంతు లేకుండా ఉందని పలువురు టీడీపీ ఎస్సీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మాలల ఆత్మీయ సమావేశంలో మాల లపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచా రాలు హద్దులేకుండా కొన సాగుతున్నాయన్నారు. దళితుల కోసం టీడీపీ అమలు చేసిన 27 పథకాలను వైసీపీ రద్దు చేసిందని ఆరోపించారు. టీడీపీ అధికారం చేపడితేనే మాలలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అధ్యక్షత వహించగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీలేరు మండలానికి చెందిన టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నగరిమడుగు సుభాష్‌, దళిత నేతలు గూడరే వుపల్లె చంద్రయ్య, లక్ష్మీపురం మల్లికార్జున, రవి, మహేష్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com