పాయకరావుపేట పట్టణం తాండవ వంతెనపై మంగళవారం సాయంత్రం పెను ప్రమాదం తృటిలో తప్పింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు ను తాండవ హైవే వంతెన వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. లారీ క్యాబిన్ ధ్వంసం కాగా బస్సు వెనుక భాగం కూడా దెబ్బతింది. బస్సు డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడం వల్ల ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.