ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్య కేసులో నిందితురాలికి జీవిత ఖైదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 28, 2023, 01:00 PM

విజయనగరం జిల్లా తుమ్మికాపల్లిలో జరిగిన హత్య కేసులో నిందితురాలికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ విజయనగరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి బి. కళ్యాణ్ చక్రవర్తి మంగళవారం తీర్పునిచ్చారు. కొత్తవలస మండలం, తుమ్మికాపల్లికి చెందిన గృహిణి. తనను అనుమానించి, మానసికంగా వేధిస్తున్నాడని భర్తను హత్య చేసింది. దీంతో కొత్తవలస పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అనంతరం కోర్టులో అభియోగ పత్రాలను పోలీసులు దాఖలు చేశారు. కోర్టు విచారణలో నిందితురాలిపై నేరారోపణలు రుజువు అయ్యాయి. దీంతో నిందితురాలికి విజయనగరం డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి జీవిత ఖైదు, వెయ్యి రూపాయలు జరిమానా విధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com