బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలంలో మంగళవారం మండల స్థాయి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎమ్మార్ అగ్రహారం లో జగనన్న సురక్ష కార్యక్రమం పై విస్తృతస్థాయి ప్రచారంలో భాగంగా ఎంపీపీ నర్సిపల్లి ఉమాలక్ష్మి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ బొమ్మి. శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఉమా లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వము జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు మరిన్ని సేవలు తీసుకువెళ్లడమే జగనన్న సురక్ష కార్యక్రమం ఉద్దేశమని ఆమె తెలిపారు. అర్హత ఉన్న వారందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, గృహసారథులు, కన్వీనర్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.