మణిపూర్ లో గత కొంతకాలంగా హింస చెలరేగుతున్న విషయం తెలిసిందే. కాగా, నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ లో పర్యటించనున్నారు. ఇంఫాల్, చురచంద్ పూర్ లోని పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని రాహుల్ పరామర్షించనున్నారు. అలాగే, అల్లర్లు ఎక్కువగా జరిగిన ప్రాంతాలను రాహుల్ పరిశీలిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, మే నెలలో హింస చెలరేగిన తర్వాత ఆ రాష్ట్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటించడం ఇదే మొదటిసారి.