ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు ఆదివాసీలను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. తాడిమెట్ల గ్రామంలోకి కొందరు మావోయిస్టులు వచ్చారు. బుర్కాపాల్ గ్రామ ఉపసర్పంచ్ మడివి గంగతోపాటు 14 మంది ఆదివాసీలను కిడ్నాప్ చేశారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా కొందరు గ్రామస్థులు పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా కోర్టు నిర్వహించి.. ఉప సర్పంచ్ మడివి గంగ (38), కవాసీ చుక్కా (30) అనే ఇద్దరు వ్యక్తులను పోలీసుల ఇన్‌ఫార్మర్లుగా పేర్కొన్నారు. అనంతరం వారిద్దరిని ఆయుధాలతో నరికి చంపారు.