రైల్వేశాఖలో 2.74 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అన్ని విభాగాల్లో కలిపి జూన్-1 నాటికి ఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. ఒక్క సేఫ్టీ విభాగంలోనే 1,77,924 ఖాళీలు ఉన్నాయని, జూన్ 1వ తేదీలోగా సేఫ్టీ విభాగంలో 9,82,037 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, 8,04,113 ఖళీలను మాత్రమే భర్తీ చేసినట్లు పేర్కొంది.