కొంతమంది పోలీసులు తమకు ఉన్న అధికారాలతో సామాన్యులపై జులుం ప్రదర్శిస్తుంటారు. చిన్న విషయాలకే దాడులకు పాల్పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని బండాలో డీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువకుడితో ఓ పోలీసు వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఆ యువకుడిపై దాడి చేశాడు. దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.