ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి నూతన నియామకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 29, 2023, 10:33 AM

విశాఖపట్నం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మునపాక మండలానికి చెందిన ప్రసాద్‌ 2014 నుంచి 2015 వరకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పని చేశారు. అంతకుముందు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు ముఖ్య అనుచరుడిగా వుంటూ కాంగ్రెస్‌ హయాంలో పలు పదవులు నిర్వహించారు. రెండుసార్లు ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌గా పనిచేశారు. వైసీపీ అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా, ఎలమంచిలి నియోజకవర్గం కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు కావడం ఈ సందర్భంగా గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com