త్యాగ నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారన్నారు. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమన్నారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభిలషించారు.