భీమవరంలో ఈ నెల 30న జరిగే పవన్ వారాహి విజయయాత్ర బహిరంగ సభ కోసం అంబేడ్కర్ సెంటర్‌ను జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) పరిశీలించారు. సభ వివరాలను పోలీస్ అధికారులకు తెలిపారు. బందోబస్తు, వారాహి వాహనంపై పవన్ ఎక్కడ నుంచి ప్రసంగించాలి, తదితర అంశాలపై వారితో చర్చించారు. రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కళ్యాణం శ్రీనివాస్‌తోపాటు సభ్యులు కనకరాజు సూరి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కరాటం సాయి, చెనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్‌కుమార్ తదితరులు ఉన్నారు.