పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామంలో జరుగుతున్న గంగమ్మ తల్లి జాతర వేడుకల్లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యేకి మేళ తాళాలు నడుమ టపాసులు పేల్చుతూ అంగరంగ వైభవంగా స్వాగతం పలికి ఆయనని ఘనంగా సన్మానించారు. అనంతరం గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందించారు.