ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణి దాడికి పాల్పడింది. తూర్పు ఉక్రెయిన్‌లో ఉన్న పిజ్జా రెస్టారెంట్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 61 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి రష్యా మిలటరీకి సహకరించాడన్న ఆరోపణలపై అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రష్యాలో వాగ్నర్ సంస్థ చీఫ్ ప్రిగోజిన్ తిరుగుబాటు చేస్తున్నప్పటికీ ఆ దేశం ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో రష్యా జరిపిన దాడుల్లో ఇదే పెద్దదని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.