ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు సచివాలయాల్లోని శానిటరీ, పర్యావరణ కార్యదర్శుల పనివేళల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 5 నుండి 10 వరకు లేదా 6 నుండి 11 వరకు విధులు నిర్వహించాలని, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం వరకు అవసరాన్ని బట్టి సచివాలయాల్లో, క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.