విబుల్డన్‌కు చెందిన వరల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ పాల్ గోల్డ్ స్టీన్ తన కెమెరాలో అద్భుతమైన చిత్రాన్ని బంధించాడు. కెన్యాలోని మాసైమారా నేషనల్ పార్కులో మూడు తలల చీతా ఫోటోను క్యాప్చర్ చేశాడు. దాదాపు 7 గంటల పాటు శ్రమించి ఈ ఫోటో తీశాడు. ఈ ఫోటోను చూసినట్లయితే ఒకే చిరుతకు మూడు తలలు ఉన్నట్లు, అవి వేర్వేరు దిశల్లో చూస్తున్నట్లు కనిపిస్తాయి. నిజానికి అవి మూడు చీతాలు. కానీ ఫోటోగ్రాఫర్ తన పర్ఫెక్ట్ టైమింగ్‌తో ఆ ఫోటోను తీశాడు. ఈ ఫోటోను చూసిన వారంతా ఫోటోగ్రాఫర్‌ను మెచ్చుకుంటున్నారు.