అట్లాంటిక్ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్మెర్సిబుల్ పేలిపోయిన విషయం తెలిసిందే. తీవ్ర పీడనం వల్ల అది పేలిపోయి అందులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా పేలిపోయిన టైటాన్ సబ్మైరెన్ శకలాలు తీరాన్ని చేరాయి. కెనడాలోని న్యూఫౌండ్ లాండ్ అండ్ లాబ్రడార్ ప్రావిన్స్ లో సెయింట్ జాన్స్ ఓడరేవుకు శకలాలను తీసుకొచ్చినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. మానవ అవశేషాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు.