పల్నాడు జిల్లా గురజాల మండలం దైద బిలంలోని తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని గురువారం ఆలయంలోకి సర్వంగ మార్గంలో శ్రీ అమరలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. కాగా ముందుగా భక్తులు కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయం వద్ద, కృష్ణా నది ఒడ్డున భక్తుల రద్దీగా ఉండే పలుచోట్ల గురజాల పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.