శృంగవరపుకోట పట్టణంలో స్థానిక వన్ వే ట్రాఫిక్ నుండి శృంగవరపుకోట మేజర్ పంచాయతీ కార్యాలయం వరకు జిల్లా పరిషత్ నిధులతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణానికి అలాగే డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు గురువారం స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు ఆయన సతీమణి వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణితో కలసి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సండి సోమేశ్వరరావు, జడ్పిటిసి ముమ్ములూరి వెంకటలక్ష్మి, శృంగవరపుకోట మేజర్ పంచాయతీ సర్పంచ్ సంతోషి కుమారి, ఉప సర్పంచ్ మోపాడ కుమార్, ఎంపీటీసీలు దేవి, దారగిరి, సన్యాసప్పుడు, ఆదిలక్ష్మి, వార్డు సభ్యులు సూరిబాబు, కృష్ణవేణి, మాజీ సర్పంచులు వెంకట్రావు, బుజ్జి, రమణ, తాతయ్యతో పాటుగా స్థానిక వైసీపీ నాయకులు సతీష్, గౌరి నాయుడు, మోపాడ శ్రీను, గంగరాజు, సూరి అప్పారావు, అర్జున్ సత్యనారాయణ రామారావు, రమేష్, రవి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.