ఉత్తరాఖండ్ టెహ్రీ జిల్లాలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. 40 LPG గ్యాస్ సిలిండర్లతో ఓ ట్రక్కు ఘన్సాలీ వైపు వెళ్తుండగా, కందిఖాల్ సమీపంలోకి రాగానే ట్రక్కులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిలిండర్లు భారీ శబ్దంతో పేలి చాలా దూరం ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్, ఆపరేటర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికులు మంటలు ఆర్పేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.