విశాఖపట్నంలో మరో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. విశాఖ ఫోర్త్ టౌన్ పరిధిలో రియల్టర్ శ్రీనివాస్, అతని భార్య లక్ష్మిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు కిడ్నాప్ కేసును చేధించారు. నలుగురు కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపులు చేపడుతున్నారు. అయితే గతంలో శ్రీనివాస్‌పై విజయవాడలోని పడమటలో చీటింగ్ కేసు నమోదైంది. ఆ సమయంలో రూ.3 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో ఉంది. ఈ తరుణంలో వాళ్లిద్దరినీ కిడ్నాప్ చేసి రూ.60 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం.