తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయనను తప్పించడంతో పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ సీటు ఇస్తామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోటంరెడ్డికి హామీ ఇచ్చారు.