వ్యక్తి ఆత్మహత్యపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లచెరువులోని అత్తా మామ ఇంట్లో నూతలపాటి ప్రతాప్ (36) నివసిస్తుంటాడు. సీసీ కెమెరాల రిపేరు నిమిత్తం గుంటూరు పట్టణం శ్రీనగర్ లోని ఆరో లైన్‌లోని గదిలో ఉంటున్నాడు. గదిలో గురువారం ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు కారణంగా మానసికంగా కృంగి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.