బొబ్బిలి పట్టణంలోని అగ్రహారం వీధికి చెందిన రమణమూర్తి అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని మోసగించి రూ.లక్షా 50వేలతో ఓ గుర్తుతెలియని మహిళ ఉడాయించింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. రమణమూర్తి తన అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసేందుకు పట్టణంలోని యూనియన్ బ్యాంకుకు బుధవారం వెళ్లాడు. అతనికి సాయం చేస్తానని ఓ మహిళ ముందుకొచ్చింది. డబ్బులు డ్రా చేసేందుకు అతనికి సహకరించడమే కాక, ఇంటికి కూడా చేర్చింది. ఇంటికి చేరగానే ఆయన్ని లోపలకు తోసేసి, బయట గడియ పెట్టింది. ఆ తర్వాత చూసుకున్నాక అతనికి చెందిన రూ.లక్షా50వేలు కనిపించలేదు. దీంతో ఆయన లబోదిబోమంటూ పోలీసులను గురువారం ఆశ్రయించాడు. ఈ విషయాన్ని సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావును అడగ్గా నిజమేనని నిర్ధారించారు. నింది తురాలి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa