యూపీలోని నోయిడా వీధుల్లో తిరుగుతున్న ఓ దూడకు గురువారం ఊహించని ప్రమాదం ఎదురైంది. నోయిడా సెక్టార్ 3 ప్రాంతంలో కరెంట్ షాక్ కొట్టడంతో ఓ దూడ సంఘటన స్థలంలోనే చనిపోయింది. రోడ్డు పక్కనే ఉన్న వర్షపు నీటిలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఇది తెలియని ఆ దూడ అందులో అడుగు పెట్టి ప్రాణాలు కోల్పోయింది. దీనికి నోయిడా పవర్ కంపెనీ లిమిటెడ్ సంస్థ నిర్లక్ష్యమే కారణమని జంతు సంరక్షణ కార్యకర్తలు ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa