మణిపూర్ లో అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. హింస సమస్యకు పరిష్కారం కాదన్నారు. మణిపూర్ పర్యటనలో ఉన్న ఆయన, శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ ను కలిశారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఘటనలు రాష్ట్రానికి, దేశానికి బాధాకరమన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు తాను సహాయం చేస్తానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa