భార్యకు ఆమె ప్రియుడితో సంప్రదాయబద్ధంగా భర్త పెళ్లిచేసి ఘటన యూపీలోని మీర్జాపుర్ జిల్లాలో జరిగింది. సంతనగర్ పీఎస్ పరిధిలోని అమోయి గ్రామానికి చెందిన వ్యక్తికి ఏడాది క్రితమే పెళ్లి జరిగింది. అయితే కొద్దిరోజులుగా భార్య పక్కింటి వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుండగా భర్త గమనించాడు. దీంతో ఇరువురి కుటుంబ పెద్దలను తానే పిలిపించి.. పెద్దలను ఒప్పించి తన భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు.