ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం కొండపై నేటి నుండి ప్లాస్టిక్ నిషేధం విధించారు. కొండపై మంచి నీరు లేదా ఇతర అవసరాల కోసం ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లు, గ్లాసుల విక్రయాలు, వినియోగం నిషేధించామని ఆలయ ఈఓ ఆజాద్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ కార్యక్రమానికి భక్తులు సహకరించాలని, తాగునీటి కోసం గాజు, స్టీలు, రాగి సీసాలను వాడాలని ఆయన సూచించారు.