కెన్యాలో ఓ ట్రక్కు అదుపు తప్పి పాదచారులవైపు దూసుకెళ్ళింది. ఈ ఘటనలో 48 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో 30 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. రద్దీ జంక్షన్ కావడంతో నిన్న సాయంత్రం కెరిచో వైపు వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి 8 వాహనాలను, పలు బైకులను ధ్వంసం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం విచారం వ్యక్తం చేశారు.