మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 25 మంది మృతిచెందారు. ప్రైవేటు బస్సు 32 మంది ప్రయాణికులతో నాగ్పూర్ నుంచి పూణె వైపు వెళ్తుండగా బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వే పై టైర్లు పేలడంతో బోల్తా పడింది. బస్సు రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లడంతో మంటలు చెలరేగి బస్సులోని 25 మంది స్పాట్ లోనే చనిపోయారు. మరికొంత మందికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించారు.