ఒడిశాలోని బాలాసోర్ లో గత నెల 2వ తేదీన ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 289 మంది మృతిచెందగా, వేయి మందికి పైగా గాయపడ్డారు. కాగా, ఆ ప్రమాదానికి సంబంధించి రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సౌత్ ఈస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ అర్చన జోషీని ఆ పదని నుండి తొలగించింది. ఆమె స్థానంలో అనిల్ కుమార్ మిశ్రాను జనరల్ మేనేజర్ గా నియమించింది.