పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామంలోని బాల యేసు నగర్ లో 20 లక్షల రూపాయలతో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే కిలారి రోశయ్య పైపులైను నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ఇంటింటికి కుళాయి కనెక్షన్ కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే కిలారి తెలిపారు. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలానే అధికారులు త్వరగా నిర్మాణం చేపట్టి ప్రజలకు ఈ పథకాన్ని అందుబాటులోకి తేవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యురాలు గొళ్ల జ్యోతి, ఎంఎస్ఎమ్ఈ డైరెక్టర్ భీమవరపు విజయలక్ష్మి, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.