ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ గా మోకా వెంకట సుబ్బారావు ను రాష్ట్ర కన్వీనర్ గా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు అమ్మ శ్రీనివాస్ నాయుడు నియామకపు ఉత్తర్వులు జారీ చేసారు. తొలినుంచి కమలం చేత భూనీ చురుకు అయిన కార్యకర్తగా పనిచేస్తూ నేడు అంబేద్కర్ కోనసీమ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యాపార పరంగా జిల్లా డ్రగ్ ట్రేడ్ యూనియన్ ఈసీ మెంబర్ గా, అమలాపురం డ్రగ్ ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షులు పనిచేస్తున్నారు. సామాజిక సేవలో భాగంగా అమలాపురం లైన్స్ క్లబ్ మెంబర్ గా సేవలు అందిస్తున్నారు. ఫిల్మ్ అసోసియేషన్ లో సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు కీలక భూమిక పోషిస్తున్న మోకా సుబ్బారావు కు మరిన్ని పదవులు ఆయన అమ్ములపొదిలో చేరే అవకాశం లేకపోలేదు.