తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. టమాటా అయితే ఏకంగా సెంచరి కొట్టేసింది. అయితే టమాటా ధర 10 - 20 రోజుల్లో తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్పత్తి కేంద్రాల నుంచి మార్కెట్లకు ఒక్కసారిగా చేరడం వల్ల ధర తగ్గే అవకాశం ఉంది. దీనిపై వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ స్పందిస్తూ.. నెల రోజుల్లో టమాటా ధరలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నామని తెలిపారు.